ఎట్టకేలకు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ షురూ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా ఏమాత్రం మొహమాట పడకుండా రిజెక్ట్ చేస్తున్న “డార్లింగ్ ప్రభాస్” ఇక చివరగా అమీర్ ఖాన్ చెప్పిన కథకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. అమీర్ ఖాన్ ఎప్పటి నుంచో బాలీవుడ్ లో బారి బడ్జెట్ తో “మహాభారతం” తీయాలని అనుకుంటున్నాడు.

కానీ అది ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఇప్పటి వరకు నడుస్తుంది. కొంత మందైతే ఇక అమీర్ ఖాన్ తీయాలనుకున్న “మహాభారతం” అటకెక్కిందని మాట్లాడుకున్నారు. కానీ మరలా ఆ సినిమాపై కొత్త వార్తలు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి. “మహాభారతం” సినిమాలో ప్రభాస్ చేత “అర్జునుడు” క్యారెక్టర్ లో నటింప చేయాలనుకున్న అమీర్ ఖాన్ ప్రభాస్ ను సంప్రదించగా అందుకు ప్రభాస్ కూడా సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ప్రభాస్ ఎప్పటి నుంచో మంచి కథతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక అమీర్ నిర్మిస్తున్న మహాభారతంనే తనకు బాలీవుడ్ ఎంట్రీ సరైన సినిమాగా భావిస్తున్నాడు. ఈ సినిమాను అమీర్ ఖాన్ వెయ్యి కోట్ల బారి బడ్జెట్ తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో ఒక వెలుగు వెలగటం ఖాయంగా కనపడుతుంది. అమీర్ ఖాన్ కృష్ణుడి పాత్ర చేయనుండగా, ప్రభాస్ అర్జునిడిగా ఎంత వరకు తన సత్తా చూపిస్తాడో చూడాలి.