ప్రభాస్ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే బాహుబలికి ముందు… బాహుబలి తరువాత అని చెప్పుకోవచ్చు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి అనేకమైన క్రేజీ ఆఫర్స్ ప్రభాస్ తలుపు తట్టాయి. వాటిని ప్రభాస్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ ను మరో క్రేజీ ఆఫర్ చేయమని బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. బాహుబలి సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసి ప్రభాస్ కు మరింత పేరు రావడానికి తన వంతు కృషి చేసిన కరణ్ జోహార్ దర్శకత్వంలో “తఖ్త్” అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను మరో హీరోగా చేయమని కరణ్ జోహార్ కోరడం జరిగింది.

ప్రభాస్ “తఖ్త్” సినిమా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడంతో, అభిమానులంతా ప్రభాస్ మరో మంచి ఆఫర్ వదులుకున్నాడని బాధపడుతున్నా, ప్రభాస్ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను సెకండ్ హీరోగా చేయమని కరణ్ జోహార్ అడగటమే ప్రభాస్ సినిమా తిరస్కరించడానికి కారణంగా కనపడుతుంది. “తఖ్త్” సినిమాలో మెయిన్ హీరో రణవీర్ సింగ్ కాగా, ప్రభాస్ సెకండ్ హీరోగా నటించడం ఇష్టం లేక సినిమా వదులుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ “సాహూ” సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దాదాపుగా 150 కోట్ల రూపాయలతో ప్రభాస్ స్నేహితులైన యువి క్రియేషన్స్ అధినేతలు నిర్మిస్తున్నారు. 2019 సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.