రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది 1970 నేపథ్యంలో సాగే ప్రేమకథని అంటున్నారు. కథ ప్రకారం యూరప్‌లోనే ఎక్కువ భాగం తెరకెక్కిస్తారు. ఈ సినిమాకు ఆసక్తికరంగా ఫ్రెంచ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘అమూర్‌’ (ఫ్రెంచ్‌లో ప్రేమ అని అర్థం) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం చిత్ర బృందం కొత్త తరహా సెట్లు నిర్మించే పనిలో ఉంది. కళా దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సెట్లు తీర్చిదిద్దే పనిలో ఉన్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.