Sunday, October 13, 2024

Bigg Boss:బిగ్ బాస్ హౌసు నుంచి ప్రేరణ అవుట్.. ఈ సారి బలయ్యేది తానే ?

- Advertisement -



Bigg Boss:బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై 15 రోజులు గడిచాయి. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో బేబక్క అవుట్ కాగా, గత వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ముఖ్యంగా శేఖర్ బాషా ఎలిమినేషన్ పై ప్రేక్షకుల్లో పెద్ద చర్చే జరిగింది. ఎందుకంటే నాగార్జున ఓటింగ్ ద్వారా కాకుండా కంటెస్టెంట్స్ ద్వారా శేఖర్ బాషని ఎలిమినేట్ చేసాడు. శేఖర్ బాషా కొడుకు పుట్టాక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ బాష కూడా బయటకు వచ్చి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా మరో కంటెస్టెంట్ కూడా ఇంటి నుంచి బయటకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఏంటి? మరి ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్ ప్రేరణ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది. ప్రేరణ భర్త శ్రీపాద్ అమ్మమ్మ ఇటీవల మరణించారు. మరి ఈ వార్తలను ప్రేరణకు బిగ్ బాస్ చెబుతారా? చెబితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంట్లో ఉంటుందా లేదా అన్నది అనుమానమే. అయితే ఈ విషాద వార్త ప్రేరణకు చెప్పినా ప్రేక్షకులకు అది చూపించడం కుదరదు. అందుకే కేవలం ప్రేరణకు మాత్రమే చెప్పే అవకాశం ఉంది. కానీ దాదాపు ఆమెను బయటకు పంపడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే శేఖర్ బాషాను ఇలా పంపినందుకు బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు ప్రేక్షకులు.

అందులోనూ ఇప్పుడిప్పుడే ప్రేరణ ఇంట్లో తన గొంతును పెంచుతుంది. రీసెంట్ గా నామినేషన్స్ లో నబీల్, విష్ణు ప్రియలతో డైలాగ్ వార్ నడిపింది. అలాగే నిన్నటి ఎపిసోడ్‌లో ప్రేరణ మణికంఠతో వాగ్వాదానికి దిగింది. లేటెస్ట్ ప్రోమోలో మణికంఠ, విష్ణు ప్రియలతో ప్రేరణ గొడవ పడింది. ఇలాంటివి వర్కవుట్ అయినప్పుడు బిగ్ బాస్ నుంచి ఆమెను బయటకు పంపే సమస్యే లేదు.

కెరీర్ పరంగా ‘హరహర మహాదేవ’ అనే కన్నడ సీరియల్ ద్వారా వెండితెరపైకి అడుగుపెట్టింది ప్రేరణ. తర్వాత రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అయితే అక్కడ వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ సీరియల్స్‌పైకి వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ‘కృష్ణా ముకుందా మురారి’ సీరియల్‌లో కథానాయిక కృష్ణ పాత్ర ప్రేరణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆమె కన్నడ అమ్మాయి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రేరణ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. కానీ వ్యాపారం కారణంగా ఆమె కుటుంబం తర్వాత బెంగళూరులో స్థిరపడింది. ఫలితంగా, ప్రేరణ కన్నడ, తెలుగు రెండూ మాట్లాడుతుంది. గతేడాది ప్రేరణ తన స్నేహితుడు శ్రీపాద్‌ను వివాహం చేసుకుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!