పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ హీరోగా గతేడాది ‘మెహబూబా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆకాష్.. మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘రొమాంటిక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఆకాశ్‌కు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ సినిమాకు అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించనున్నారు.

కాగా కథా, మాటలు, స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. ఛార్మి తో కలసి పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ముహూర్తం షాట్ కు క్లాప్ కొత్తగా , సీనియర్ నటి రమాప్రభ ఈ వేడుకకు హాజరయ్యింది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇప్పుడు ఆకాశ్‌ నటించబోయే మూడో చిత్రం కూడా ప్రేమకథ నేపథ్యంతోనే తెరకెక్కబోతుంది. ఈ సినిమా అయిన ఆకాశ్‌కు మంచి హిట్‌ ఇస్తుందో లేదో వేచి చూడాలి.