రామ్ గోపాల్ వర్మ ప్రియా శిష్యుడిగా పూరి జగన్నాధ్ అందరికి సుపరిచితమే. రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన “వోడ్కా విత్ వర్మ” బుక్ లో కూడా ముందు మాటగా వర్మ గురించి హార్ట్ టచింగ్ మాటలు మాట్లాడి అప్పట్లో కొంత సంచలనం కలిగించాడు పూరి జగన్నాధ్. వర్మతో ఎప్పుడు క్లోజ్ గ ఉంటూ సరదా సరదాగా గడిపే వీరిద్దరి మధ్య కొంత కాలంగా లేవని ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి గల కారణాలు చెబుతూ, వర్మ కొన్ని రోజుల క్రితం యాక్టర్ శ్రీరెడ్డిని అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం పూరి జగన్ కు నచ్చలేదని, ఆ సమయంలో పూరి జగన్నాధ్ నేరుగా ట్విట్టర్ వేదికగా వర్మను తప్పుపట్టాడు.

అప్పటి నుంచి పూరి జగన్నాధ్ కు, వర్మకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, అందుకే ఈ మధ్య వారిద్దరూ కలసి ఎక్కడ కనపడటం లేదని తెలుస్తుంది. కానీ దీనిపై వర్మ మాట్లాడుతూ మా మధ్య అలాంటిగొడవలు ఏమి లేవని, అసలు ఇంతక ముందు కన్నా, ఇప్పుడు మేమిద్దరం మరింత క్లోజ్ గా ఉంటున్నామని వర్మ చెబుతున్నాడు. వర్మ చెప్పనట్లు వారిద్దరికి ఎటువంటి గొడవలు లేవన్న విషయంపై పూరి జగన్నాధ్ కూడా క్లారిటీ ఇచ్చి పుకార్లకు ఫుల్ స్టాప్ పెడతాడో లేదో చూడాలి.