ఎప్పుడు కల కళలాడుతూ ఒక సినిమా తరువాత ఒక సినిమా అన్నట్లు హడావిడి చేసే పూరి జగన్నాధ్ ఇప్పుడు సినిమాలు లేక అతని ఆఫీస్ ప్రాంతమంతా వెలవెలబోతుంది. ఒకప్పుడు పూరితో సినిమా అంటే పెద్ద హీరోలు ఎవరైనా సై అనేవారు. కారణం పూరి దర్శకత్వం వహించిన సినిమా మినిమం గ్యారెంటీతో పాటు మూడునెలల్లో సినిమాను సిద్ధం చేసి పక్కాగా రిలీజ్ చేసేస్తాడు. నిర్మాతలు కూడా అలానే పూరితో సినిమా అంటే అలానే ఆసక్తి చూపుతూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో పూరి చేస్తున్న సినిమాలు వరుస ఫెయిల్ అవుతుండటంతో ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోని పూరి ఇప్పుడు నిరాశకు లోనైనట్లు తెలుస్తుంది.

పూరి జగన్ తన కొడుకు హీరోగా తాను సొంతగా నిర్మించి దర్శకత్వం వహించిన “మెహబూబా” దారుణమైన ప్లాప్ రావడంతో నష్టాలు భారీగా వచ్చాయని, ఒకవైపున అప్పుల బెడద మరో వైపు సినిమాలు వరుస ఫెయిల్ తో ఏమి తోచక పూరి కూడా నిమ్మకుండిపోయినట్లు తెలుస్తుంది. “మెహబూబా” తో తాను కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతానని పూరి గట్టిగా నమ్మాడు. కానీ ఆ చిత్రం తేడా కొట్టడంతో పాటు పెట్టిన పెట్టుబడి మొత్తం రిలీజ్ అయిన మొదటి షో కె తుడిచిపెట్టుకుపోయింది. అంటే సినిమా అంతలా డిజాస్టర్ కు గురైంది.

Mehaboob puri next movie

ఇక పూరి జగన్ తన కొడుకు ఆకాష్ తో మరో సినిమా చేయాలని అనుకున్నా, “మెహబూబా ఫెయిల్ తో ఆ సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టి కొత్త వారితో మరో సినిమా చేయడానికి పూనుకున్నాడు. కానీ ఆ సినిమా చేయడానికి పూరికి అర్జెంటు గా నిర్మాత కావాలని, నిర్మాత కోసం కొంత వేచి చూస్తునట్లు ఉంది. కానీ పూరి జగన్ నష్టాలలో ఉండటంతో పూరితో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపడంలేదని తెలుస్తుంది. పూరి మాత్రం కొత్త వారితో సినిమా చేసి తన సత్తా ఏమిటో ఇండస్ట్రీకి మరో సారి తెలియచేయాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.

తన సినిమాలు వరుస ఫెయిల్యూర్ తో తన టీమ్ మొత్తం మార్చి కొత్త టీమ్ ను తీసుకున్నా ప్లాపుల బెడద మాత్రం తప్పడంలేదు. పూరికి మరలా మంచి హిట్ వచ్చి పూరి ఆఫీస్ మరోసారి కలకల లాడాలని తనతో పనిచేసి బయటకు వెళ్లిన సభ్యులు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం పూరి జగన్ కొత్త వారితో తీసే సినిమా సంచలనం సృష్టిస్తుందో లేక మరోసారి లెక్క తప్పుతుందో.