సూపర్ స్టార్ రజినీకాంత్ 165 వ సినిమా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష కథానాయికగా నటిస్తుంది. విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం తమిళ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ‘పేట్టా’ అనే పేరును ఖరారు చేసారు. ఈ టైటిల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసింది. నవంబరు 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.