మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అజర్‌బైజాన్‌ అనే దేశంలో జరుగుతుంది. తూర్పు ఐరోపాలోని పెద్ద దేశంగా ఉన్న అజ‌ర్ బైజాన్‌ లో మంచి లొకేష‌న్లు ఉన్నాయని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రం టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

చిరంజీవి హీరోగా 1989లో వచ్చిన ‘స్టేట్ రౌడీ’ సినిమా టైటిల్ నే, ఇప్పుడు చరణ్ – బోయపాటి చిత్రానికి పెడుతున్నారని తెలుస్తోంది. అయితే టైటిల్ విషయంలో చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.