అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సినిమా యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ ట్రైలర్‌ను చూసిన హీరో రాంచరణ్ .. సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అఖిల్, రాంచరణ్ మంచి స్నేహితుల అన్న విషయం తెలిసిందే. అఖిల్‌, నిధి అగర్వాల్‌, వెంకీ, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, చిత్ర బృందానికి ఆల్‌దిబెస్ట్‌ చెప్పిన రాంచరణ్.. ట్రైలర్‌ లింక్‌ను షేర్‌ చేశారు. కాగా ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రం జనవరి 25న విడుదలకానుంది.