వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ అయిన ‘కథా నాయకుడు’పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. ‘క‌థానాయ‌కుడు’ చిత్రంలో ఎన్టీఆర్‌గా న‌టించిన బాల‌కృష్ణ పై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్టీఆర్ ‘క‌థానాయ‌కుడు’ చిత్రం తాను చూడ‌లేద‌ని, అయితే ఆ సినిమా ట్రైల‌ర్ చూశాన‌ని, నాకు ఎన్టీఆర్ ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని వ‌ర్మ.. బాలకృష్ణ పరువు తీసాడు.

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో అంద‌రూ కొత్త వాళ్ళ‌నే తీసుకున్నాన‌ని, ఎందుకంటే ఇది బ‌యోపిక్ ఫేం ఉన్న న‌టుల్ని తీసుకుంటే వాళ్ళే క‌నిపిస్తారు కాబట్టి రియ‌ల్ లైఫ్ పాత్ర‌లు కనిపించాలంటే కొత్త‌వాళ్ళు అయితేనే బెట‌ర్ అని త‌న అభిప్రాయ‌మ‌ని తెలిపారు. ఇన త‌న ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో ఎన్టీఆర్ పాత్ర‌కు గోదావ‌రి జిల్లాకు చెందిన రంగ‌స్థ‌లం నుటుడ్ని తీసుకుని కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చామ‌ని.. ఇందులో అన్ని పాత్ర‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ఇచ్చామ‌ని, ఈ చిత్రంలో అన్ని వాస్త‌వాలే ఉంటాయ‌ని పేర్కొన్నారు వ‌ర్మ. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నామ‌ని తెలిపారు. బాలకృష్ణలో ఎన్టీఆర్ లోని కొన్ని పోలికలు ఉండవచ్చని.. కానీ ఎన్టీఆర్ అంత ఛరిస్మా లేదని వర్మ తెలిపారు.

varma balakrishna