హాలీవుడ్ లో హీరోయిన్స్ తమ శరీర భాగాలు అన్నీటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటుంటారు. అలాగే ఇప్పుడు తెలుగు సినిమాలలో అడపాదడపా నటిస్తున్న జబర్దస్త్ యాంకర్ గా అందరకి సుపరిచితురాలైన హాట్ ముద్దు గుమ్మ రష్మీ గౌతమ్ తన తొడలకు ఇన్సూరెన్స్ చేయించండి ప్లీజ్ అని అడుగుతుంది.

రష్మీ నటించిన “అంతకు మించి” సినిమా ఈ వారం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా అంతగా పాపులర్ కాకపోయినా రష్మీ ఈ సినిమాలో నటించడం వలన రష్మీ అభిమానులకు ఈ సినిమాపై కొంత ఫోకస్ ఉంది. రష్మీ ఈ సినిమాలో తన అంద చందాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. రష్మీ నటించిన “గుంటూరు టాకీస్” సినిమా ప్రేక్షకులను అలరించకపోయినా రష్మీ అందచందాలు చూడటానికి బి, సి సెంటర్స్ లో జనం ఎగపడ్డారు. ఈ దెబ్బతో గుంటూరు టాకీస్ నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.

ఇక రష్మీ గౌతమ్ “అంతకు మించి” సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో నా అందం ఒక్కటే కాకుండా సినిమాను చూసి థియేటర్స్ కు రమ్మని, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెబుతుంది. ఈ అమ్మడు ఇంకా తన తొడల గురించి చెబుతూ ఒకొక్కరిలో ఒక్కో అందం ఉంటుందని బహుశా నా థైస్(తొడలు) జనాలను ఆకట్టుకుంటున్నాయేమో అని మొహమాట పడకుండా చెబుతుంది. రష్మీ తన కాళ్ళ గురించి ఎవరో కామెంట్ చేస్తే దానికి ట్విట్టర్ లో స్పందిస్తూ వాటికి భీమా కల్పించండి ప్లీజ్ అంటూ సరాదాగా వ్యాఖ్యానించింది.