యాంకర్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా తరువాత సినిమా కెరీర్ లో మంచి సక్సెస్ లు చూసిన వారిని చాల మందిని చూసాం. ఇప్పుడు తెలుగులో హాట్ యాంకర్ లుగా పరిచయమైనా అనసూయ, రష్మీ అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఇక రష్మీ విషయానికి వస్తే యాంకర్ గా మంచి పాపులర్ అయినా, సినిమాల పరంగా ఇంత వరకు సరైన హిట్ చూడలేదు. రష్మీ హీరోయిన్ గా వచ్చిన “గుంటూరు టాకీస్” సినిమాలో ఎంతలా రెచ్చిపోయిందో చూసే ఉంటాం. సినిమా పరంగా ప్లాప్ టాక్ మూటగట్టుకున్న రష్మీ అందాలు చూడటానికి బి, సి సెంటర్స్ లో జనం ఎగబడ్డారు. దీనితో ఈ ప్రాజెక్టు అమాంతం ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తరువాత రష్మీ చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇప్పుడు “అంతకుమించి” అనే పేరుతో రష్మీ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై రష్మీ చాల ఆశలే పెట్టుకొంది. ఈ సినిమాలో రష్మీ స్కిన్ షో తో రెచ్చిపోయినట్లు కనపడుతుంది. స్కిన్ షోని నమ్ముకొని “గుంటూరు టాకీస్” నిర్మాతలు బయటపడినట్లు ఈ ప్రాజెక్ట్ కూడా రష్మీ స్కిన్ షోతో సేఫ్ జోన్ లోకి వెళుతుందా లేక సినిమాలో ఏమైనా విషయముంటుందా అనేది చూడాలి.