ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాను పట్టుకొని అలాంటివి మరో 20 నుంచి 30 సినిమాలు వేలం వెర్రిగా పుట్టుకురావడం సహజమే. అప్పట్లో మారుతీ తీసిన “ఈరోజులో, బస్ స్టాప్” సినిమాలను పోలిన సినిమాలతో ప్రేక్షకుల మీద నిర్మాతలు దండయాత్ర చేసారు. కానీ ఆ సినిమాలన్నీ థియేటర్స్ లో ఉదయం ఆటకే చేతులెత్తేసాయి.

ఇక అర్జున్ రెడ్డి సక్సెస్ తరువాత అలంటి సినిమా పోకడతో వచ్చిన “ఆర్ఎక్స్ 100” సినిమాపై మంచి అంచనాలు ఏర్పడి, కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులకు సినిమాలో మంచి కంటెంట్ ఉండటంతో సినిమా పెట్టుబడికి నాలుగింతలు సంపాదించి నిర్మాతలు ఖుషి అయ్యారు.

ఇప్పుడు అదే పోకడతో ఈరోజు ట్రైలర్ విడుదలైన “రధం” సినిమా కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ముద్దులతో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో ఆ చిత్ర సంస్థ పడింది. కాని అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలలో కంటెంట్ ఉండటంతో వారు చేసిన డిఫరెంట్ పబ్లిసిటీ తో సక్సెస్ అయ్యారు. ఇక ఆ సినిమాలను అడ్డుపెట్టుకొని మనం కూడా నాలుగు రాళ్లు వెనకవేసుకోవచ్చని ప్రయత్నిస్తే మాత్రం బొక్కబోర్లా పడటం ఖాయంగా కనపడుతుంది.

రథం సినిమా ట్రైలర్