యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఎన్టీఆర్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. పండుగ సీజన్‌ కావటంతో ముందు ముందు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సక్సెస్‌మీట్‌ను నిర్వహించిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన అరవింద టీం.. చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాట కవర్‌ వర్షన్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటను ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్‌ దాస్‌ స్వయంగా రాసి పాడారు.