ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న “అరవింద సమేత” సినిమాకు సంబంధించి ఈరోజు ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్ “రెడ్డి ఇక్కడ చూడు” అనే లిరికల్ సాంగ్ విడుదల చేసారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్నట్లు తెలుస్తుంది.అక్టోబర్ 11 న భారీగా ఈ సినిమా విడుదల చేయడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది.

ఈ సినిమాకు సంగీత ఎస్ఎస్.థమన్ అందిస్తుండగా, ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే, ఈషా రెబ్బ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ “వీరరాఘవ రెడ్డి”గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తుంది. “రెడ్డి ఇక్కడ చూడు” అనే లిరికల్ సాంగ్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, పాపులర్ సింగర్ దలేర్ మొహంది, తెలుగు గాయని అంజనా సౌమ్య పాటను ఆలపించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ మీద చిన్నబాబు నిర్మిస్తున్నారు.