అమెరికాలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులపై వచ్చిన సెక్స్ రాకెట్ ఆరోపణలు సంచలనం సృష్టించింది. ఈ సంచలనాలు ఎంత వరకు వెళ్లాయంటే ప్రముఖ హీరోయిన్స్ అందరూ ఉన్నారని, వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని కొంత మంది ఫీలర్లు వదిలారు. వీటితో ఎంతో మంది అగ్ర తారలు కంగారు పడిపోయారు. ఆ సమయంలో కొందరు రెజినా పేరు పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఇన్ని రోజులు మౌనముగా రెజినా ఈరోజు స్పందించింది.

తనపై వచ్చిన రూమర్లను రెజినా సున్నితంగా కొట్టిపారేసింది.మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడి తమ స్థాయిని తగ్గించుకోవద్దని రెజినా తెలియచేసింది. కొంత మంది నిజాలు తెలియకుండా మాట్లాడారని, నిజాలు తెలుసుకోకుండా ఒకరి మీద నింద వేయడం ఎంత వరకు కరెక్ట్ అని, చేసే పనిలో నిజాయితీ ఉంటె స్పందించాల్సిన పని లేదని, సినిమా ఇండస్ట్రీ ఒక్కటే చెడ్డది అనటం కరెక్ట్ కాదని, కార్పొరేట్ లలో కూడా సమస్యలు ఉన్నాయని, కానీ మేము కెమెరా ముందు ఉంటాం కాబట్టి మా మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి మమల్ని టార్గెట్ చేస్తారని, కానీ ఇలాంటి వివాదాల పట్ల మాట్లాడకుండా ఉండటమే కరెక్ట్ అని, మాట్లాడితే మరల నన్నే కార్నర్ చేస్తారని, ఈ సెక్స్ రాకెట్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని రెజినా తెలియచేసింది.

Tags : Regina Casandra, America Sex Rocket, Telugu Film Industry, Tollywood, Telugu Movies