పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ పవన్ నుంచి విడిపోయిన తరువాత పుణేలో తన ఇద్దరి బిడ్డలతో నివాసముంటుంది. ఇన్ని రోజుల ఒంటరి జీవితం తరువాత రేణుదేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకోనున్నట్లు తెలియచేసి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకొని ఇద్దరు రింగులు మార్చుకున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత రాదంతం చేసారో అందరికి తెలిసిన విషయమే.

తన పెళ్లి తరువాత రేణుదేశాయ్ కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. రేణు దేశాయ్ తెలుగులో రైతులు పడుతున్న బాధలు, వారి ఆత్మహత్యలపై ఒక సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని, కానీ సినిమా తీసే ముందు ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో కొంత కాలం గడిపి, అక్కడ రైతులు పడుతున్న కష్టనష్టాలను పూర్తిగా విశ్లేషించి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.

రేణు దేశాయ్ కు దర్శకత్వం చేయడం కొత్తేమి కాదు, ఇప్పటికే మరాఠీలో “ఇష్క్ వాలా లవ్” పేరుతో సినిమాకు దర్శకత్వం వహించింది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందింది. ఇక ఇప్పుడు రైతుల మీద రేణుదేశాయ్ తీయబోయే సినిమా కొంత  సాహసమనే చెప్పుకోవచ్చు. రైతులు పడే కష్టాలను స్వయంగా తెలుసుకొని సినిమా తీస్తాను అంటుంది అంటే, సినిమాపై గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు ఉంది. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరువాత తెలుగు రాష్ట్రాలతో అంతగా సంబంధాలు కొనసాగించలేదు. మరలా తిరిగి తెలుగు సినిమా ఇండస్ట్రీ వేదికగా తెలుగులో సినిమా తీస్తుంది అంటే అందరకి ఇక్కడ ఆసక్తి నెలకొని ఉంది.