kirak RP: కిరాక్ ఆర్పీ ఇటీవలి కాలంలో చాలా ఎక్కవ సార్లు వార్తల్లో నిలుస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా కొనసాగిన ఆయన తన కామెడీ స్కిట్ల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే మల్లెమాల వారితో వచ్చిన విభేదాల కారణంగా ఈ షో నుంచి బయటకు వచ్చి అనంతరం మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇక జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చిన తర్వాత కిరాక్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అంటూ ఓ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. ఈ బిజినెస్ మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈయన ఇటీవల కాలంలో తన బిజినెస్ పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తూ జనసేనకు మద్దతు పలుకుతూ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ విధంగా వైసీపీ నాయకుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటంతో కిర్రాక్ ఆర్పీ వ్యవహారం సంచలనంగా మారింది. ఇక ఈయన కెరీర్ పరంగా రాజకీయాల పరంగా పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే గత ఏడాది లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి అయి ఏడాది కూడా కాకుండానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఈయన ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా.. తరచూ రాజకీయాల గురించి మాట్లాడడంతో వివాదాలలో చిక్కుకోవడమేనని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను తన మాజీ ప్రియుడుతో కలిసి తిరగడం ఆర్పీ చూశాడని అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారంటూ ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆర్పీ పై వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు.. కానీ ఈ విషయం మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలు నిజం కాకపోతే.. ఆయన ఇప్పటికే ఈ పుకార్లను పూర్తిగా ఖండించేవారు. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో ఈ వార్తలు నిజమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.