అర్జున్ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్ కు పెట్టె ముద్దులు ఎన్ని పెట్టాడో చూడటానికే సగం మంది యువత సినిమాకు వెళ్లారంటే ఆశ్చర్యం కలగక మానదు. అలంటి సినిమానే ఇప్పుడు ఇంకొకటి విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్ఎక్స్ 100 పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఎంత సంచలనాలు నమోదు చేసికుందో తెలిసిన విషయమే, ఈ సినిమాలో మీరు ఎన్ని ముద్దులు పెట్టి ఉంటారని హీరోను అడిగితే, దానికి అతను ఎన్ని ముధ్దులు పెట్టానో గుర్తు లేదని సమాధానం ఇచ్చి సినిమా ఎంత స్పైసీగా ఉంటుందో చెప్పకనే చెప్పాడు.

సిటీలో లిప్ కిస్ హోర్డింగ్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి, ఇంకా హీరో మాట్లాడుతూ సినిమాలో వచ్చే ప్రతి ముద్దు సీన్ ఏదో కావాలని పెట్టుకున్నట్లు కాకుండా సందర్భానుసారం లిప్ కిస్ సీన్స్ వస్తాయని తెలియచేసాడు. రేపు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై యువతలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టికెట్స్ కూడా ప్రీ బుకింగ్ లో బాగానే తెగుతున్నాయని చెబుతున్నారు. ఆశ్చర్యంగా యూఎస్ లో రికార్డు స్థాయిలో 120 స్క్రీన్స్ ఈ సినిమా కోసం దక్కించుకోవడం ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది.

Tags : RX100, Payal Rajput, Ramki, Lipkiss Scens, Rao Ramesh