ప్రభాస్ “బాహుబలి” సినిమా తరువాత అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న “సాహూ” సినిమా రిలీజ్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉందని తెలుస్తుంది. సినిమా వర్క్ పరంగా వచ్చే ఏడాది వేసవి సమయానికి రెడీ అవుతుందా అనేది నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇక మరో వైపున చిత్రం అప్పటికి రెడీ అయినా అదే సమయానికి మహేష్ బాబు హీరోగా “మహర్షి”, చిరంజీవి హీరోగా 150 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “సైరా నరసింహ రెడ్డి” కూడా ఉండటంతో కొంత వెనక్కు వెళ్లి ఆగష్టు 15 న వస్తే ఎలా అంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది.

బాహుబలితో దేశవ్యాప్తంగా మన్ననలు పొందిన ప్రభాస్ తదుపరి సినిమా “సాహూ” కోసం అన్ని ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సౌత్ ఇండస్ట్రీతో పాటు, బాలీవుడ్ లో కూడా “సాహూ” సినిమాకు పోటీ లేకుండా రిలీజ్ చేసుకోవాలంటే ఆగష్టు 15 అయితేనే సరైన సమయమని ఆలోచిస్తున్నట్లు కనపడుతుంది. కానీ సినిమా రిలీజ్ ఎప్పుడనేది చిత్ర యూనిట్ ప్రకటిస్తే తప్పా ఈ తేదీ మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం లేదు.