సాయి పల్లవి గురించి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూ మీడియాలో తన పేరు నానుతూ ఉంటుంది. అలాంటి సాయి పల్లవి ఒక బడా ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టడానికి మొదటి సినిమా నుంచి పేరున్న హీరోయిన్ లను తీసుకుంటూ వారికి బారి రెమ్యూనరేషన్ ఇస్తూ, తన కొడుకుని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. సినిమాల పరంగా కూడా ఎప్పుడు బారి సెట్ లతో, ఏమాత్రం ఖర్చుకు వెనకాడని ఆ బడా నిర్మాత సాయి పల్లవిని తన కొడుకు తరువాత సినిమాలో నటింపచేయడానికి 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.

కానీ సాయి పల్లవి ఏమాత్రం మొహమాట పడకుండా నేరుగా నో చెప్పేసినట్లు తెలుస్తుంది. ఆ ప్రొడ్యూసర్ తో సినిమా అంటేనే డబ్బులు బాగా గిట్టుబాటవుతాయని అనుకునే హీరోయిన్ లకు సాయి పల్లవి నో ఎందుకు చెప్పిందో అర్ధం కాక సినీ జనాలు బుర్రలు గోకుంటున్నారు. ఆమె గురించి తెలిసిన కొందరు చెబుతూ సాయి పల్లవి అంటేనే అంతే అని, డబ్బుల కోసం కాకుండా సినిమాలో తన క్యారెక్టర్ తో పాటు, సాటిసిఫెక్షన్ ఉంటేనే చేస్తుందని చెబుతున్నారు. సాయి పల్లవి నో చెప్పడంతో మరొక హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.