నాగచైతన్య హీరోగా, రమ్యకృష్ణ అత్త పాత్రలో వస్తున్న శైలజ రెడ్డి అల్లుడిపై ఇప్పుడు బిజినెస్ వర్గాలలో చాల అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రేపు వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. “శైలజ రెడ్డి అల్లుడు” సినిమా అన్ని ఏరియాస్ లో హాట్ కేకులులా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రైట్స్ 24.9 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. వినోదం ప్రధానంగా సాయాజీ సినిమా కావడం మరియు చాల రోజుల తరువాత మంచి పవర్ ఫుల్ అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించడంతో బయ్యర్లు అందరూ ఈ సినిమాపై ఆసక్తిని చూపారు.

థియేటర్ రైట్స్ అంత భారీగా పోవడంతో ఇక శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ కూడా భారీగా వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమాను కొనుకున్న బయ్యర్లు సేఫ్ జోన్ లోకి రావాలంటే సినిమా కలెక్షన్స్ 45 కోట్ల రూపాయల గ్రాస్ రావాల్సి ఉంది. దర్శకుడు మారుతీ మంచి కామెడీ టైమింగ్ తో ఈ మధ్య కాలంలో విజయాలు అందుకోవడం కూడా సినిమాకు బాగా కలసి వచ్చింది.

శైలజ రెడ్డి అల్లుడు ఏరియాల వారీగా బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం

నైజం                     6.50 కోట్లు

సీడెడ్                     3 కోట్లు

వైజాగ్                     2.25 కోట్లు

ఈస్ట్                       1.62 కోట్లు

వెస్ట్                        1.26 కోట్లు

కృష్ణా                      1.53 కోట్లు

గుంటూరు               1.71 కోట్లు

నెల్లూరు                  0.72 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా  2. 25 కోట్లు

ఓవర్ సీస్                3. 25 కోట్లు