బిగ్ బాస్ షో ఇప్పుడు దేశమంతా ఒక ఊపు ఊపుతుంది. ముందుగా ఈ షో బాలీవుడ్ వేదికగా మొదలై సంచలనాలకు నాందిగా నిలుస్తుంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 11 సీజన్లు ముగించుకున్న బిగ్ బాస్ షో, 12వ సీజన్ కోసం సన్నాహాలు మొదలు పెట్టింది. 12వ సీజన్ కూడా సల్మాన్ ఖాన్ నే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ అక్షరాలా 288 కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఏమిటి షాక్ కు గురవుతున్నారా? ఇది అక్షరాల నిజం. ప్రతి ఎపిసోడ్ కోసం 12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ లెక్కన 24 ఎపిసోడ్స్ కోసం 288 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఒక్క సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 288 కోట్ల రూపాయలు తీసుకుంటుంటే ఇక బిగ్ బాస్ నిర్వాహకులకు ఎంత ఆదాయం వస్తుందో ఊహించడం కష్టమే. బాలీవుడ్ బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా చాల పాపులర్. దానికి తగ్గట్లే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఇరగతీయడంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా సల్మాన్ ఖాన్ కు అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.