తెలుగు బిగ్ బాస్ 2 , గతవారమే ముగిసిపోవడంతో చివరి వారం బయటకు వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొంత మందికైతే బయటకు వచ్చిన తరువాత వారి ఇళ్ల దగ్గర అభిమానులు తీన్ మార్ డాన్స్ లు ఏర్పాటు చేసి పండుగ వాతావరణం సృష్టించారు. ఇక ఇంటర్వ్యూ ల పేరుతో మీడియా చానెల్స్ అన్ని పోటీ పడుతున్నాయి.

ఇందులో భాగంగానే బిగ్ బాస్ 2 ఫైనల్ కు చేరిన వారిలో ఒకడైనా సామ్రాట్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో చెబుతూ, అభిమానులు తన మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారని, కొంతమంది అభిమానులైతే తన మీద ప్రేమతో పచ్చ బొట్లు కూడా పొడిపించుకున్నారని, వారు అందరూ తన మీద ఇంత అభిమానం చూపిస్తునందుకు నాకు చాల సంతోషంగా ఉందని సామ్రాట్ రెడ్డి తెలియచేసాడు.

సామ్రాట్ ఇంటర్వ్యూలో తన పేరు పచ్చ బొట్లు పొడిపించుకుంటున్నారనేదే కొంత వినడానికి ఎబెట్టుగా ఉంది. అసలు నిజంగా సామ్రాట్ పేరు పచ్చ బొట్లు పొడిపించుకునేంత అభిమానులు ఉన్నారంటారా అంటే నమ్మశక్యంగా లేదు. అసలు బిగ్ బాస్ హౌస్ లో సామ్రాట్ ఎప్పుడు రొమాన్స్ ల పేరుతో ముద్దులు, హుగ్గులు ఇవ్వడం తప్ప చేసిందేమి లేదు. ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ అలా అలా నడిపించేసాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కౌశల్ కున్న ఫాలోయింగ్ చూసి కంగుతున్న ఇంటిసభ్యులు ఏదో ఒక రూపంలో వారు కూడా లైమ్ లైట్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సామ్రాట్ కూడా ఇలా పచ్చబొట్ల వ్యవహారం చెప్పినట్లు తెలుస్తుంది. తనంటే నచ్చి కొంత మంది అభిమాను పచ్చ బొట్లు పొడిపించుకున్నారని చెప్పే సామ్రాట్ ఎవరెవరు పచ్చ బొట్లు పొడిపించుకున్నారో కూడా వారి ఫోటోలు మీడియాకు విడుదల చేస్తే సామ్రాట్ కున్న అభిమానులను చూసి ప్రేక్షకులంతా సంతోషిస్తారు కదా? అలా చేయాలంటే పచ్చ బొట్లు పొడిపించుకున్న అభిమానులు ఉండాలి కదా?