దిల్ రాజు కాంపౌండ్ లోకి ఒక్కసారి అడుగుపెడితే ఇక అక్కడ నుంచి బయట పడటం చాల కష్టమంటారు చాల మంది. అలా అని వారిని దిల్ రాజు హింసపెడుతున్నట్లు కాదు, ఒక సినిమా తరువాత ఒక సినిమా ఆఫర్స్ ఇస్తూ వారిని తన దగ్గరే ఉంచుకోవడంలో దిల్ రాజుది అందె వేసిన చెయ్యి. ఇప్పటి వరకు ఇలానే అనిల్ రావిపూడి, వంశి పైడిపల్లి, హరీష్ శంకర్ చాల రోజుల పాటు దిల్ రాజు కాంపౌండ్ లోనే సినిమాలు తీస్తూ కాలం గడిపేశారు.

ఇప్పుడు అదే కోవలోకి “శతమానం భవతి” దర్శకుడు సతీష్ వేగ్నేష్ చేరినట్లు తెలుస్తుంది. రచయిత నుంచి దర్శకుడిగా మారడానికి సతీష్ చాల కష్టపడ్డాడు. దిల్ రాజు దగ్గర తన కథను ఒప్పించుకొని శర్వానంద్ హీరోగా “శతమానం భవతి” సినిమాను రూపొందించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత అదే ప్రొడక్షన్ హౌస్ లో రెండో సినిమాగా “శ్రీనివాస కళ్యాణం” సినిమాను రూపొందించాడు. ఈ సినిమా విడుదలకు ముందే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత తన మూడవ చిత్రం కూడా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో పనిచేయనునట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. సతీష్ వేగ్నేష్ ఇంకా దిల్ రాజు దగ్గర ఎన్ని సినిమాలు చేస్తాడో చూద్దాం.