నాగ చైతన్య నటించిన తాజా చిత్రం సవ్యసాచి. తొలి రోజే అంచనాలకు తగ్గ వసూళ్లు రాబట్టని ‘సవ్యసాచి’ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేక పోయింది. వారాంతంలోనే ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేదు. తొలి రోజు రూ.4.15 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజులూ కలిపి వసూలు చేసింది 3.5 కోట్లు మాత్రమే. మొత్తంగా తొలి మూడు రోజుల వారాంతంలో ఈ చిత్రం రూ.7.65 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టింది.

సవ్యసాచి చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ ఫైనల్ గా ఫ్లాప్ అని ట్రేడ్ తేల్చేయడంతో ఇక కోలుకోవడం కష్టంగానే ఉంది. వీక్ ఎండ్ వల్ల నిన్నటి దాకా ఓ మాదిరి వసూళ్లు వచ్చినా ఇప్పటి నుండి రావడం కష్టమేనని అంటున్నారు.