మంచి కాఫీ లాంటి సినిమాలు తీయడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. సమాజంలో జరిగే కుళ్ళుని కడిగేసి మంచి లీడర్ ను పరిచయం చేసి తనలో మరో కోణం కూడా ఉందని బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల శిష్యుల హావ నడుస్తుంది. శేఖర్ కమ్ముల దగ్గర పాఠాలు నేర్చుకొని దర్శకులుగా మారిన ఇద్దరు కుర్ర దర్శకులు.. నిర్మాతలకు హాట్ కేకులుగా మారారు.

వారిలో ఒకరి అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ కాగా, మరొకరు గత శుక్రవారం విడుదలై కలెక్షన్స్ తుఫాను రేపుతున్న “గూఢచారి” దర్శకుడు శశికిరణ్. వీరిద్దరూ శేఖర్ దగ్గర పాఠాలు నేర్చుకొని శేఖర్ బాటలోనే మంచి క్లీన్ మూవీలు తీస్తూ శేఖర్ పేరు నిలబెడుతున్నారు. మహానటితో నాగ్ అశ్విన్ రేంజ్ మొత్తం మారిపోయింది. నాగ్ అశ్విన్

తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతను మహానటిని ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో తెలుస్తుంది. మరో శిష్యుడు శశికిరణ్ దర్శకత్వం వహించిన “గూఢచారి” సినిమా స్పై థ్రిల్లర్ గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.