యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొన్ని రోజులుగా ప్లాపులతో కొట్టు మిట్టాడుతుంటే “గరుడవేగా” రూపంలో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సక్సెస్ ఉత్సాహంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ అనే ఇంటెలిజెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన “ఆ” సినిమా గుర్తు ఉండే ఉంటుంది. నాచురల్ స్టార్ నాని ఇష్టపడి ఆ సినిమాను తానే సొంతగా నిర్మించాడు.

ఇప్పుడు ఈ దర్శకుడు రాజశేఖర్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కథ అంతా సిద్ధం చేసుకొని, రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకున్నారు. కానీ రాజశేఖర్ కు హీరోయిన్ దొరకక కింద మీద పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్, శ్రీయా శరన్ లను సంప్రదించగా నో చెప్పినట్లు వినపడుతుంది. ఇప్పుడు మరో హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడికి పెద్ద తల నొప్పిగా మారినట్లు తెలుస్తుంది. లేకపోతే చివరిగా నార్త్ నుంచి ఎవరైనా హీరోయిన్ ను దిగుమతి చేసుకునే పనిలో కూడా నిమగ్నమైనట్లు తెలుస్తుంది. కొంత సీనియారిటీ వచ్చిన తరువాత తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత కొంత ఎక్కువగానే కనపడుతుంది.