నాగ చైతన్య తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాగచైతన్య కెరీర్‌లో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని అంటున్నారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ మూవీలో రమ్యకృష్ణ, అను ఇమాన్యుయేల్‌, మురళీ శర్మ, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు.

తొలిరోజు వసూళ్లు:

నైజాం: రూ.2.50 కోట్లు

సీడెడ్‌: రూ.1.04 కోట్లు

యూఏ: రూ.82 లక్షలు

తూర్పు గోదావరి: రూ.72 లక్షలు

పశ్చిమ గోదావరి: రూ.42 లక్షలు

కృష్ణ: రూ.40 లక్షలు

నెల్లూరు: రూ.23 లక్షలు

గుంటూరు: రూ.80 లక్షలు

మొత్తం ‌: రూ.6.93 కోట్లు