బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా షకీలా జీవిత గాధకు సంబంధించి సినిమా ఒకటి రెడీ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తున్నారు. ఒకప్పుడు మలయాళంలో షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోల సినిమాలకు కూడా టికెట్స్ తెగేవి కావు. షకీలా అభిమానులు మలయాళంలో అంతలా ఉన్నారు. ఆ సమయంలో చాల మంది స్టార్ హీరోస్ షకీలను ఎలా అయినా నిలువరించాలని ఆమె పై ఎన్నో కుట్రలు చేసినట్లు తెలుస్తుంది.

షకీలా కూడా వారి కుట్రలకు చాల వరకు బలై తరువాత రోజులలో సినిమాలో నటించాలంటేనే ఇబ్బంది పడింది. షకీలపై చేసిన కుట్రలకు సంబంధించి షకీలా బయోపిక్ లో ప్రతి ఒక్కటి స్పష్టంగా చూపించనున్నారని తెలుస్తుంది. మొదటగా షకీలా బయోపిక్ సినిమా తీయడానికి షకీలను కలసిన దర్శకుడికి తన మీద ఎవరెవరు కుట్రలు చేసి తనను అణగదొక్కడానికి ప్రయత్నించారన్న విషయాలు పూసా గుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. షకీలా చెప్పిన ప్రతి విషయం బయోపిక్ లో ఉన్నది ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నించారట.

షకీలా కూడా తన బయోపిక్ అంతా తెరిచిన పుస్తకంలా ఉండాలి తప్ప వాటిలో కొన్ని పేజీలను చెరిపేసుకోవాలనుకోవడం లేదని, అందుకే ఈ సినిమాను దర్శక, నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోస్ పేర్లు చెప్పకపోయినా ప్రేక్షకులకు అర్ధమయ్యేలా హింట్స్ మాత్రం ఉండేలా చూసారని, షకీలను ఇబ్బంది పెట్టింది ఎవరో ప్రేక్షకులకు తీయడానికి అది చాలని వారి జీవితాలను రోడ్డు మీదకు లాగడానికి షకీలా భావిస్తోందట. అన్నట్లు ఈ సినిమాను బాలీవుడ్ తో పాటు, సౌత్ లో కూడా వివిధ బాషలలో విడుదల చేయనున్నారు. షకీలా బయోపిక్ లో… షకీలా కూడా ఒక చిన్న పాత్రలో చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. చూద్దాం చెప్పినట్లు షకీలా బయోపిక్ ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో?