షకీలను ఒకప్పుడు అభిమానులు శృంగార దేవతగా పిలిచేవారు. షకీలా సినిమా వచ్చిందంటే థియేటర్స్ దగ్గర టికెట్స్ కోసం పడిగాపులు కాసేవారు. అంతలా తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకున్న షకీలాకు సంబంధించి బాలీవుడ్ లో రూపొందుతున్న షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో షకీలా రోల్ ను బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డా పోషిస్తున్నారు.

Shakeela Movie First Look

ఒంటి నిండా బంగారం వేసుకొని నూలుపోగు బట్టలు లేకుండా సెగలు పుట్టించే ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో షకీలా సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. షకీలా కూడా తన బయోపిక్ లో ఒక కీలక రోల్ పోషించడం గమనార్హం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ కు చెందిన ఇంద్రజిత్ లోకేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ప్రస్తుతానికి నిర్మాణాంతర కార్యక్రమంలో బిజీగా ఉంది.