తెలుగు హీరోలు అప్పుడప్పుడు తమిళ దర్శకుల కథలను కూడా వింటూ నచ్చితే వారితో చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువ హిట్ సినిమాల కన్నా, ప్లాప్ సినిమాలే ఎక్కువ. కారణం తమిళ దర్శకులు మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగట్లు సినిమాలు తియ్యకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలెవరు తమిళ దర్శకుల జోలికి వెళ్లకుండా మన తెలుగు దర్శకుల చుట్టూనే తిరుగుతున్నారు.     

కానీ ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్న శర్వానంద్ మాత్రం ఒక తమిళ దర్శకుడికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే 2019 లో మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తమిళంలో నాలుగు సినిమాలు చేసిన ఆ దర్శకుడి పేరు “తిరు”. ఈ దర్శకుడు తీసిన రెండు సినిమాలు తెలుగులో అనువాదం కూడా అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన విశాల్ నటించిన “వేటాడు వెంటాడు, ఇంద్రుడు” సినిమాలు ఈ దర్శకుడే రూపొందించాడు.  

ఈ రెండు సినిమాలు సరికొత్త కథాంశంతో వచ్చి మంచి హిట్ సాధించాయి. దర్శకుడు తిరు కూడా కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తాడని తమిళ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇప్పుడు “తిరు” చెప్పిన కథ కూడా శర్వానంద్ కు నచ్చడంతో  పచ్చ జెండా ఊపాడు. ప్రస్తుతం శర్వానంద్ “పడి పడి లేచే మనసు” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో శర్వానంద సరసన సాయి పల్లవి నటిస్తుంది.