.
Shekhar basha: బిగ్ బాస్ సీజన్-8లో ఇప్పటివరకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే.. 90 శాతం మంది శేఖర్ బాషా అంటున్నారు. గత రెండు వారాల్లో హౌసులో కాస్తో కూస్తో ఫన్ జనరేట్ అయిందంటే… దానికి కారణం శేఖర్ బాషానే అంటున్నారు. తన పంచ్ లు, జోకులతో హౌస్ మేట్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బీబీ ప్రేమికులను కూడా పుల్ గా అలరించారు. అతని నాన్-సింక్ పంచ్‌లు నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. బెస్ట్ వ్యూ అంటే ‘ఐ లవ్ యూ’, చిరాకు అంటే ఛీ.. రాకు అంటూ శేఖర్ బాషా వేసిన జోకులు నిజంగా సూపర్. ఇక బయటకు వచ్చిన తర్వాత శేఖర్ బాషా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శేఖర్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయాడు. బిగ్ బాస్ లో తన అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తే.. నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్లిపో అందని శేఖర్ బాష ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందన్నారు. తన భార్య డెలివరీకి ముందు మూడు రోజులు ఏదో ఆందోళనకు గురయ్యానని.. అందుకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చానని శేఖర్ బాషా తెలిపాడు. కానీ, తీరా ఇంటికి వెళ్లగానే తన భార్య ఎందుకొచ్చావ్ వెళ్లిపోవాలని అందనీ, కనీసం టాప్-5లోనైనా ఉంటావని భావించానని, ఇలా చేసి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వస్తవా అని చాలా ఏడ్చేసిందని శేఖర్ బాషా తెలిపాడు. కానీ తనకు బాబుని ఎత్తుకున్న సంతోషం చాలాని శేఖర్ భాష అన్నారు.
బిగ్ బాస్ కి వెళ్లేందుకే రాజ్ తరుణ్ విషయాన్ని లేవనెత్తాడని కొందరు అంటున్నారు అది నిజమేనా అని ప్రశ్నించగా.. అదేం లేదు వాస్తవానికి నేను వెళ్తానో లేదో విషయం కూడా అసలు క్లారిటీ లేన్నారు. ‘డెలివరీ దగ్గర్లో ఉంది.. వెళ్లాలా వద్దా అని తన భార్యను అడిగినప్పుడు ఆమె ఓ రోజు అంతా ఆలోచించి వెళ్లమని చెప్పింది. ఆ వారం ముందు వరకు అసలు తెలిదు. బిగ్ బాస్ టీమ్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా తన భార్య డెలివరీకి వన్ డే పర్మీషన్ కావాలి లేదా వారిని చూపించాలన్నాను. అందుకు వాళ్లు ట్రై చేస్తామని చెప్పారని శేఖర్ భాష చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ షో నా అని ప్రశ్నించగా.. ‘లేదు. అసలూ కాదు. ఎలిమినేషన్ కూడా వారి చేతుల్లో లేదు. ‘ అని బదులిచ్చాడు. కానీ, బీబీ ప్రేమికులు కూడా అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ.. నేను బయటకు రావడమే కరెక్ట్ అన్నారు. కొడుకు పుట్టినప్పుడు ఏ తండ్రికి అయినా కొన్ని ఫార్మాలిటీలు ఉంటాయి. వాటిని ఫుల్ ఫిల్ చేయడం తండ్రి బాధ్యత. అందుకే బయటకు రావాలని బలంగా కోరుకున్నాను…’ అన్నాడు.