మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న “మహర్షి” సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకొని ఇటీవలే హైదరాబాద్ తిరిగివచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజు రోజుకి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్, వ్యాపారవేత్త, రైతుగా ఇలా మూడు వేరియేషన్స్ లో కనపడనున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణతో కలసి లెజెండ్ సినిమాలో నటించిన సోనాల్ మహేష్ బాబుతో ఆడిపాడనునట్లు తెలుస్తుంది. మహేష్ బాబు వ్యాపారవేత్తగా అమెరికాలో ఉన్న సమయంలో సోనాల్ పరిచయమవుతుందని, వారిద్దరి మధ్య కొన్ని సీన్స్ రొమాంటిక్ గా ఉంటాయని సమాచారం. ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటుంది.