దిల్ రాజు, సతీష్ వేగేశ్న,మిక్కీ జ్ మేయర్ కలయికలో గత ఏడాది వచ్చిన శతమానం భవతి ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. మళ్ళీ అదే కలయిక లో వచ్చిన సినిమా ఈ “శ్రీనివాస కళ్యాణం”. అదే కధా గమనం కానీ ఇక్కడ నేపధ్యం మాత్రం పెళ్లి.

మనిషి జీవితంలో పుట్టుక,పెళ్లి,చావు అనేవి ముఖ్యమైన ఘట్టాలు. మనం పుట్టినప్పుడు అందరు సంతోషంగా వున్నా అది మనం చూడలేము. మనం చనిపోయినప్పుడు అందరు భాధ లో వున్నా అది కూడా మనం చూడలేము. కానీ పెళ్లి అనే ఒక్క ఘట్టాన్ని మాత్రం మనం చూస్తూ ఎంతో సంతోషం గ చేసుకుంటాము. పెళ్లి కి వున్న ఔన్నిత్యాన్ని ..గొప్పతనాన్ని తెర మీదకి తీసుకొచ్చిన ప్రయత్నమే ఈ శ్రీనివాస కళ్యాణం.

నిజం గ ఏది దిల్ రాజు అండ్ టీం చేసింది గొప్ప ప్రయత్నేమే. పెళ్లి లో జరిగే చాల సాంప్రదాయ విషయాలను నేటి తరానికి తెలియ చేయాలి అని అనుకున్నారు. తెర నిండా చాలా మంది నటి నటులతో చాలా కలర్ ఫుల్ గ చక్కటి నేపధ్య సంగీతం తో సినిమా సాగిపోతుంది.

కానీ…

సినిమా అంత చాలా ఫ్లాట్ గ సాగిపోతూ……సన్నివేశాల్ని బలం గ చెప్పకుండా కేవలం మాటలు ద్వారానే పెళ్లి ఒక్క గొప్పదనాన్ని గురుంచి పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతూ పోతుంటే చివరికి వచ్చే సరికి పెళ్లి తాలూకు గొప్ప భావోద్వేగాలు కూడా ప్రేక్షకుల మది లోంచి కరిగిపోతాయి. మంచి ప్రయత్నాన్ని ఎప్పుడు వినోదాత్మక గ చెప్పినప్పుడే కమర్షియల్ గ సక్సెస్ చేయగలం. కానీ ఇక్కడ కొంచెం వినోదం ఉన్నప్పటికీ పెళ్లి అనే సుదీర్ఘ ప్రక్రియ దాని డామినెట్ చేసి ఎంతో గొప్ప చిత్రం గ రూపొందాలిసిన చిత్రం చివరకు మాములు సగటు చిత్రం గ మిగిలింది ఈ శ్రీనివాస కళ్యాణం.

ఒక్కటి కూడా బలమైన సన్నివేశం లేక పోవటం ఈ సినిమా లో వున్న చాలా పెద్ద లోటు.పెళ్లి అనే కాన్సెప్ట్ సినిమా కి ఎంత బలం ఇయ్యిందో అదే ఇక్కడ ప్రతిబంధకం గ మారింది. సినిమా మొత్తం పెళ్లి చుట్టూ ( అంటే పెళ్లి ఒక్క గొప్పతనం) తిరగడం తో ఓవర్ డోస్ ఐన ఫీలింగ్ వస్తుంది.

టైం కి వేల్యూ ఇచ్చే ఒక బిజినెస్ మాగ్నెట్ ( ప్రకాష్ రాజ్) సంప్రదాయాలకు విలువలు ఇచ్చే కుటుంభం లో కి ( హీరో గారి కుటుంభం) అమ్మాయిని ఇచ్చేటప్పుడు జరిగే తంతు కార్యక్రమమే ఈ శ్రీనివాస కళ్యాణం. కానీ ఈ సంప్రదాయాల డోస్ మరి ఎక్కువ ఇయ్యి సరికి మనకి కూడా ప్రకాష్ రాజ్ లాగా ఆలోచించడమే కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. పాత్రలు అన్ని కూడా చాలా పాసివ్ మూడ్ లో ఉండేసరికి మరియు అన్ని పాత్రలు ఒకేరకంగా మాట్లాడే సరికి సినిమా అంతా చాలా ఫ్లాట్ గ వెళ్లి పోతున్న ఫీలింగ్ వస్తుంది. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ లో కూడా కొన్ని మాత్రమే మాజికల్ మూవ్మెంట్స్ వున్నాయి.
అందరు యాక్టర్స్ చాల బాగా చేశారు కానీ ఎక్కడ బలమైన సన్నివేశాలు పడలేదు. కొంచెం బలమైన సన్నివేశాల్లో డ్రామా మరి ఎక్కువ ఐన ఫీలింగ్ వస్తుంది. శ్రీనివాస కళ్యాణం టైటిల్ సాంగ్ మిగిలిన అన్ని పాటలని డామినెట్ చేసేసరికి మిగిలిన పాటలు సరిగా రిజిస్టర్ అవ్వవు.

కుటుంబ ప్రేక్షకులకి నచ్చే కొన్ని అంశాలు ఉన్నప్పటికీ …వినోదం పాళ్ళు తగ్గేసరికి మరి క్లాస్ పీకుతున్న ఫీలింగ్ వస్తుంది.విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ కొంచెం అసెట్ ఇయ్యింది. సత్యం రాజేష్ పాత్ర కొంచెం ఎంటర్టైన్ చేసింది. మరీ యాక్టర్స్ లిస్ట్ ఎక్కువ ఉండేసరికి అందరి గురుంచి ప్రస్తావించే ఓపిక లేదు. అందరు బాగానే చేశారు..కానీ గుంపులో కలిసిపోయారు.

బాటమ్ లైన్ :
మీకు మన పెళ్లి లో జరిగే సంప్రదాయాలు గురుంచి కొంచెం తెలుసుకోవాలంటే …పెళ్లి మంత్రాల అర్థం ఏమిటో తెలుసుకోవాలంటే ….నటి నటులను తెర నిండా చూడాలి అని అనుకుంటే ..ఇంట్లో మీ పెళ్లి క్యాసెట్ చూసి చూసి బోర్ కొట్టి వేరే సినిమాటిక్ టైపు పెళ్లి ఒకటి చూడాలి అనుకుంటే … మీరు ఈ శ్రీనివాస కల్యాణానికి ఆహ్వానితులే……

రేటింగ్ : 2.5 / 5 — ఈ సాంప్రదాయ కల్యాణానికి పెద్దగా చదివింపులు రాక పోవచ్చు. కుటుంబ ప్రేక్షకులదే భారం….

రివ్యూ బై : చేగొండి