శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి పేరు చెబుతుందో అని ఆమెతో అప్పట్లో చనువుగా ఉన్న హీరోలు కొంత అలజడికి గురైన మాట వాస్తవమే. శ్రీరెడ్డి హీరోయిన్ గా ట్రై చేసే సమయంలో చాల మంది చిన్న హీరోలు పెద్ద పెద్ద స్టార్స్ గా ఎదిగిపోయారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎన్నో వ్యాఖ్యానాలు చేసింది వారిలో ప్రముఖంగా యాక్టర్ నాని పేరు చెప్పుకోవచ్చు. నాని బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయిన తరువాత ఎంత రచ్చ చేయాలో అంత చేసింది. ఈ విషయంపై నాని భార్య కూడా మాట్లాడిందంటే అతని కుటుంబం ఎంత బాధ పడి ఉంటుందో తెలుస్తుంది.

ఇక ఇప్పుడు శ్రీరెడ్డి కొత్తగా ఒక అగ్ర దర్శకుడి పేరు చెప్పి మరో బాంబు పేల్చింది. ఆ ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ కావడం విశేషం. శ్రీరెడ్డి పోస్ట్ పెడుతూ మురుగుదాస్ గారు మనమిద్దరం గ్రీన్ పార్క్ హోటల్ లో కలిసాం మీకు గుర్తుందా, రచయిత వెలిగొండ శ్రీనివాస్ ద్వారా కలిసాం. ఆ రోజు హోటల్ లో మనం చాలా…. మీరు నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. ఇంత వరకు నాకు అవకాశం ఇవ్వలేదని, కానీ మీరు చాల గొప్ప వారని చెప్పి తన పోస్ట్ ముగించింది.

అమెరికా సెక్స్ రాకెట్ గురించి కూడా చాల మంది ఫీలర్లు శ్రీరెడ్డినే వదిలింది. తాను కాస్టింగ్ కోచ్ గురించి మీడియా ముఖంగా మాట్లాడుతున్న సమయంలో తనను ఎవరెవరు విమర్శించారో వారి ఫొటోలతో సహా సెక్స్ రాకెట్ తో వారికున్న సంబంధాలను బయటపెట్టడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ గురించి మనం హోటల్ లో చాల… అంటూ ఆపడం కూడా విస్మయాన్ని గురిచేస్తుంది. శ్రీరెడ్డి ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా తనకు అవకాశాలు రాకపోవడంతో అపట్లో తనకు అవకాశాలు ఇప్పిస్తానని వాడుకున్న అందరి పేర్లు బయట పెట్టి ఇప్పుడు తన పగ తీర్చుకుంటుంది అనుకోవచ్చు. ఇలా శ్రీరెడ్డి ఇంకా ఎంత మంది పేర్లు బయటపెడుతుందో ఇంకా ముందు ముందు రోజులలో చూడాలి.

Tags : Srireddy, Srireddy Comments on Murugadoss, Murugadoss, veligonda Srinivas, Srireddy coments on Casting Coach