బాహుబలి సిరీస్ తరువాత పూర్తిగా కుటుంబంతో గడుపుతున్న రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ – రామ్ చరణ్ కామినేషన్ లో మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ ఇప్పటి వరకు బయటకు రాకపోగా, ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో, ఎటువంటి కథాంశంతో రాజమౌళి ఈసారి ఎన్టీఆర్ – రామ్ చరణ్ ను చూపించబోతున్నాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు,.

ఈ సినిమా కథ విషయంలో ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్ లో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొత్తగా ఈ సినిమా కథ గురించి బయటకు వచ్చింది. రాజమౌళి నిర్మించబోయే “ఆర్ఆర్ఆర్” సినిమా స్వాతంత్రోద్యమ కాలం నాటి కథకు సంబంధించి అని తెలుస్తుంది.ఇప్పటికే సినిమా షూటింగ్ కు సంబంధించి సెట్స్ రెడీ అవుతున్నాయి. సెట్స్ అన్ని ఆ కాలానికి సంబంధించినవిగా ఉన్నట్లు తెలియడంతో ఈ సినిమా స్వాతంత్య్రానికి సంబంధించి ఉండవచ్చని పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి గాసిప్స్ పుడుతూనే ఉంటాయి.