ఇటీవల కాలంలో అక్కినేని హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ మధ్య శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో వచ్చిన చైతు.. ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. నాగార్జున, నాని మల్టీస్టారర్ సినిమా ‘దేవదాస్’ కూడా అనుకున్నంతగా ఆడలేదు. ‘మళ్లీ రావా’ సినిమాతో ఫ్రెష్ గా హిట్ కొట్టిన హీరో సుమంత్. రీసెంట్ గా ‘సుబ్రమణ్యపురం’ వంటి థ్రిల్లింగ్ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మెల్లగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

2. 0 వంటి సూపర్ హిట్ సినిమా ఆడుతున్న సమయంలో వచ్చిన సుమంత్.. పోటీపడి మరి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో సుమంత్ చాలా సంతోషంగా ఉన్నాడు. కాగా సుమంత్ నటించిన ‘ఇదం జగత్’, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి.