లవ్ స్టోరీస్ సుకుమార్ ఎంత అద్బుతంగా డీల్ చేస్తాడో ఆర్య, ఆర్య 2 సినిమాలే నిదర్శనం. అలాంటి సుకుమార్ తరువాత రోజులలో అన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ లవ్ స్టోరీస్ కు దూరం జరిగాడు. ఇప్పుడు సుకుమార్ తాను మరో అద్భుతమైన లవ్ స్టోరీ రాసినట్లు చెబుతున్నాడు.

సుకుమార్ తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయనున్నాడు. కానీ సుకుమార్ రాసిన లవ్ స్టోరీ తాను దర్శకత్వం వహించకుండా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సుకుమార్ కథలు అందించిన “కుమారి 21ఎఫ్” మంచి హిట్ అందుకోగా “దర్శకుడు” సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు సుకుమార్ తాను నిర్మాతగా మారి మూడో చిత్రంగా తాను రాసుకున్న లవ్ స్టోరీని అందించనున్నాడు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తన శిష్యుడినే ఇండస్ట్రీకి పరిచయం చేయవచ్చని తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా వచ్చే ఏడాది మొదలవనుంది, ఈ టైం లో తాను రాసుకున్న స్టోరీకి మెరుగులు దిద్హి పట్టాలెక్కించి పనిలో సుకుమార్ సిద్ధంగా ఉన్నాడు.