తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కాదంటున్నారు హీరో సుమన్. అసలైన హీరో రానానే అంటున్నారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి మాట్లాడారు.

‘బాహుబలి’ సినిమాలో అసలైన హీరో ప్రభాస్‌ కాదు.. రానా. మీరు గమనించినట్లైతే క్లైమాక్స్‌లో ప్రభాస్‌ టచ్‌ చేయకుండానే రానా పాత్ర మంటల్లో పడి చనిపోతుంది. దీనిని బట్టి చూస్తే సినిమా చివరి వరకు రానాదే పవర్ఫుల్ పాత్రని.. సినిమాలో ఓ ప్రతినాయుకుని పాత్రని చంపడం అంత సులువు కాదన్నారు. ఆ సన్నివేశాన్ని చూపించడానికి గట్స్‌ కావాలి. అది కేవలం రాజమౌళికే సాధ్యమైంది. క్లైమాక్స్‌ వరకు ఓ హీరో 40 మంది రౌడీలను కొట్టడంలో పెద్ద విషయం ఏమీ లేదు’’ అని అన్నారు సుమన్‌.