తెలుగు సినిమాలలో సునీల్ మరలా కమెడియన్ గా చేస్తే ఎంత బాగుంటుందో అని ఎంతో మంది ప్రేక్షకులు కోరుకుంటారు. కారణం సునీల్ కమెడియన్ గా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలవడంతో పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే వారు. ఇప్పటికి యూట్యూబ్ లో సునీల్ చేసిన కామెడీ బిట్స్ కు మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి.

అలాంటి సునీల్ హఠాత్తుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్నాడు. సునీల్ తీసుకున్న టర్న్ తో మొదట అందరూ షాక్ అయ్యారు. కాని సునీల్ హీరోగా మొదట చేసిన ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక సునీల్ రెమ్యూనరేషన్ కూడా అమాంతం ఆకాశాన్ని తాకింది. సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రేంజుకు ఎదిగిపోయాడు.

ఈ క్రమంలో మొదట ఒకటి రెండు సినిమాల తరువాత వరుస పెట్టి ప్లాప్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అవి కూడా సూపర్ డిజాస్టర్స్ అవ్వడంతో తిరిగి మరలా కమెడియన్ గా తన పాత్ర కొనసాగించడానికి రెడీ అయ్యాడు. సునీల్ వేసిన స్టెప్ కరెక్ట్ కాదని చాల మంది భావించారు.

ప్రేక్షకుల వెర్షన్ లో సునీల్ తన కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని అనుకునే వారికీ సునీల్ కెరీర్ ఒక సారి పరిశీలిస్తే, సునీల్ కమెడియన్ గా ఉన్న రోజులల్లో సంవత్సరం మొత్తం సినిమా షూటింగ్ లకే పరిమితమవుతూ ఉండాలి, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువ. రోజుకి రెండు సినిమా షూటింగులు ఉన్న రోజులు కూడా ఉండేవి. ఎప్పుడు పడితే అప్పుడు వెకేషన్స్ కు వెళ్లే తీరిక ఉండదు. మరలా కమెడియన్ గా సంపాదన చాల తక్కువ, అదే సునీల్ హీరోగా చేస్తే ఆరునెలల కొకసారి సినిమా చేసుకుంటే చేతి నిండా డబ్బుతో, తన కుటుంబంతో పాటు, తన కెరీర్ ను ఆర్ధికంగా చాల మెట్లు ఎక్కించుకోవచ్చనుకున్నాడు.

ఇక ఇప్పుడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో సునీల్ ను హీరోగా పెట్టి సినిమా తీసే నిర్మాతలు లేకపోవడంతో తనకు నచ్చిన, మెచ్చిన కమెడియన్ పాత్రలో ఒదిగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ముందుగా తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దశకత్వంలో వస్తున్న “అరవింద సామెత” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరలా నరేష్ తో కలిసొ సిల్లీ ఫెలోస్(సుడిగాలి 2 ) సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సునీల్ 1.25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. హీరోగా నటిస్తున్న నరేష్ కు, కమెడియన్ గా నటిస్తున్న సునీల్ ఇద్దరికి సిల్లీ ఫెలోస్ సినిమాలో ఒకే రెమ్యూనరేషన్ కావడం విశేషం. మనకు సునీల్ కమెడియన్ గా ఉంటె ఇష్టం, కానీ సునీల్ హీరోగా చేసి తనకు తాను ఆర్ధికంగా ఉన్నత స్థానానికి వెళ్లి హ్యాపీగా కమెడియన్ పాత్రలు వేసుకుంటాడు.

చివరగా ఈ రంగుల ప్రపంచంలో ఏ ఆట ఎలా ఆడాలో తెలిసినవాడు ఒక్కో అడుగు ముందు వేసి సక్సెస్ చూడగలడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సునీల్ ఆ ఆటలో ముందు వరుసలో ఉన్నాడని అనుకోవచ్చు.