తమిళనాడు తరువాత కన్నడ ప్రజలకు వారి ప్రాంతం గురించి సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. అప్పట్లో కావేరి జలాల విషయమై “బాహుబలి” సినిమాను కన్నడ ప్రాంత ప్రజలు ముప్పుతిప్పలు పెట్టారు. కన్నడ సెంటిమెంట్ దెబ్బకు బాహుబలి దర్శకుడు రాజమౌళి, సత్య రాజ్ వారితో చర్చించి శాంతిప చేసారు.

ఒకప్పటి పోర్న్ స్టార్, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ “వీరమహాదేవి” అనే సినిమాలో నటిస్తుంది. ఈ “వీరమహాదేవి” కన్నడ వీరనారి కావడం వలన ఈ సినిమాలో ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించడంతో కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

“వీరమహాదేవి” పై జరుగుతున్న గొడవలకు ఇంతవరకు సన్నీ లియోన్ స్పందించలేదు. దీనిపై సన్నీ లియోన్ ఎలా స్పందిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా తన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ హీరోయిన్ గా అరగేంట్రం చేసింది. ఈ మధ్య కాలంలో భారతదేశానికి చెందిన ఒక్క పిల్లవాడిని దత్తత కూడా తీసుకొంది. కానీ ఆమెకు పోర్న్ స్టార్ అనే ముద్ర చెరిగిపోవడం లేదు.

పోర్న్ స్టార్ గా ఒకప్పుడు వెలుగొందిన సన్నీ లియోన్ ఇప్పుడు తాను ఆ వృత్తిని వదిలిపెట్టి చక్కగా సినిమాలు చేసుకుంటున్నా ఆమెపై ఇలాంటి నిందలు వేస్తూ కొన్ని సంఘాలు గొడవలు చేయడం ఎంత వరకు సబబని ఆమె సన్నిహితులు వాపోతున్నారు