స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కే వీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ లాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా దీని తర్వాత ‘సింగం’ దర్శకుడు హరి దర్శకత్వంలో సూర్య నటించబోతున్నాడని సమాచారం. అయితే ఇది ‘సింగం 4’గా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. విభిన్న కథతో హరి ఈ సినిమాను తీయాలనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే సూర్య-హరి కాంబినేషన్‌లో వస్తోన్న ఆరో సినిమా ఇది అవుతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ‘ఆరు’, ‘దేవా’, ‘సింగం’, ‘సింగం 2’, ‘సింగం 3’ హిట్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.