చిరంజీవి సినిమాలను పక్కన పెట్టి, రాజకీయాలలోకి వచ్చి మరలా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల తరువాత మొహానికి రంగు వేసుకొన్న మొదటి సినిమా ఖైదీ నెం 150 సినిమా 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టి చిరంజీవి స్టామినా ఏమిటో తెలియచేసింది. ఇక నిన్న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన “సైరా నరసింహ రెడ్డి” టీజర్ విడుదలైన 12 గంటలలోనే 6.6 మిలియన్ వ్యూస్ సాధించి ఔరా అనిపించింది. దీనికి తోడు రెండునర్ర లక్షల లైక్స్ తో రికార్డు సృష్టించింది.

ఈ టీజర్ పై ఇప్పటి వరకు అభిమానులతో పాటు, సామాన్య ప్రేక్షకులను కూడా అబ్బురపరచడంతో సినిమా పట్ల అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ మాట్లాడుతూ టీజర్ ముందుగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు పంపించానని, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఈ టీజర్ చూసి మెగాస్టార్ చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పరని రామ్ చరణ్ తెలియచేసాడు. ఈ సినిమాను 2019 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు  తెలియచేసారు.