తమన్నా ఒకవైపున హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లో ఆడి పడుతుంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన “జైలవకుశ” సినిమాలో తమన్నా చేసిన డాన్స్ సినిమా మొత్తానికే హైలెట్ గా మారింది. ఈ సినిమాలో “స్వింగ్ జర స్వింగ్ జర” అనే పాటకు కుర్ర కారు కూడా మొత్తం ఫిదా అయిపోయారు. ఇక ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ తో తమన్నాకు మరో సారి స్పెషల్ సాంగ్ లో ఆడి పాడేందుకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

కన్నడలో యాష్ హీరోగా వస్తున్న “కెజిఎఫ్” అనే సినిమాలో తమన్నా ఆడి పడనుందని తెలుస్తుంది. ఈ పాట కోసం తమన్నాకు భారీగా రెమ్యూనరేషన్ ముట్ట చెప్పనున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ పాట 1970లో రాజ్ కుమార్ నటించిన “పరోపకారి” సినిమాలోని పాటను పోలి ఉంటుందని, ఈ పాట సినిమాకే హైలెట్ అని యూనిట్ వర్గాలు తెలియచేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అందాల ఆరబోతతో యువకులను రెచ్చగొట్టిన ఈ బ్యూటీ కన్నడ పాటలో కూడా తన సత్త చూపిస్తుందేమో చూడాలి.