తెలుగు బిగ్ బాస్2 లో మొదటి నుంచి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచిన తేజస్విని మదివాడ గత వారం ఎలిమినేట్ అయింది. తాను ఎలిమినేట్ అయిన తరువాత బయటకు వచ్చాక తన గురించి బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని షాక్ కు గురైంది. తనపై కత్తి కట్టి కౌశల్ ఆర్మీ పేరుతో ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకున్న అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసారని ఒక వీడియో రూపంలో ప్రేక్షకులకు తెలియచేసింది.

బిగ్ బాస్ హౌజ్ లో తేజస్వి – సామ్రాట్ ప్రేమ పురాణం అందరకి తెలిసిన విషయమే. చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని తేజస్విని హౌజ్ లో చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీనిపై ప్రేక్షకులు కొంత మంది అసహనం వ్యక్తం చేస్తే, కొంత మంది తేజస్వినికి సపోర్ట్ చేసారు. తేజస్విని లేకపోవడంతో బిగ్ బాస్ లో మాసాల తగ్గిందని వాపోయేవారు ఉన్నారు.

దీనిపై తేజస్విని మాట్లాడుతూ సామ్రాట్ కు నాకు మధ్యలో ఏమి లేదని, అతను చాల మంచి మనిషని, అతనితో పాటు తనీష్ కూడా చాల మంచి వాడని, మా మధ్యలో ప్రేమ ఇలాంటివి ఏమి లేవని, మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్ అవుతారని, అలాగే మేమంతా ఫ్రెండ్స్ అయ్యామని తేజస్విని తెలియచేసింది.

తేజస్విని చెప్పిన దానికి లోపల జరిగిన దానికి పొంతన కుదరటం లేదు. తేజస్విని చేసిన అతి వల్లే తేజస్వినిపై చాల మంది అసహనం పెంచుకున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయిన వారు హౌస్ లోకి ఎంట్రీ అవ్వవచ్చని బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వడంతో తేజస్విని మరల తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తుంది. ఈ సారి నన్ను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తే నేనేంటో నిరూపించుకొని, బిగ్ బాస్ విజేతగా తిరిగి వస్తానని తెలియచేసింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సంజన, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్విని మదివాడ వీరిలో ఎవరు తిరిగి హౌస్ లో అడుగుపెడతారో ఈ ఆదివారం తేలిపోనుంది.