కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణకు చెందిన ఇద్దరు హీరోలు నితిన్, విజయ్ దేవరకొండ గురించి అభిమానులు రెండుగా చీలిపోయి తెలంగాణ మెగాస్టార్ మా హీరో అంటే మా హీరో అని గొడవలకు దిగుతున్నారు. ముందుగా నితిన్ నటించిన “శ్రీనివాస కళ్యాణం” విడుదలై ప్రేక్షకాదరణ నోచుకోక చతికల పడింది. ఇక నిన్న ఆగష్టు 15న విడుదలైన విజయ్ దేవరకొండ “గీత గోవిందం” సినిమా సూపర్ సక్సెస్ తో ముందుకు వెళుతుంది. విజయ్ సినిమా నిన్న మొదటి రోజు బడా హీరోల రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగి అందరిని ఔరా అనేలా చేసాడు.

ఒకవైపున విజయ్ దేవరకొండ వరుసగా “పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం” వంటి వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంటే, నితిన్ ఏమో “లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణ” లాంటి సినిమాలలో  నటించి ప్లాప్ సినిమాల వైపు పరుగులు తీస్తున్నాడు. ఇప్పుడు విజయ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు, విజయ్ తో బడా నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, గీత ఆర్ట్స్ లాంటి బడా సంస్థలు ఇప్పటికే కర్చీఫులు వేసాయి. విజయ్ దేవరకొండను ఒక దశాబ్దం పాటు కదపలేనంత బిజీ స్టార్ గా మారిపోయాడు. “గీత గోవిందం” సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి విజయ్ దేవరకొండను ప్రశంసలతో ముంచెత్తాడు. మెగాస్టార్ లాంటి నటుడు స్వయంగా విజయ్ దేవరకొండను ప్రశంసించడంటే నిజమైన నైజాం మెగాస్టార్ ఇక విజయ్ దేవరకొండ అని అనిపిస్తుంది.