Vijay:మిల్కీ బ్యూటీ తమన్నా ఏ విషయమైనా సరే ఓపెన్ గా చెబుతుంది. అలా విజయ్ తో తన లవ్ మేటర్ ని కూడా ఓపెన్ గానే చెప్పేసింది.అయితే తాజాగా రాజ్ షమణి చేసిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రీవియస్ లవ్ బ్రేకప్ ల గురించి కూడా బహిరంగంగానే ఒప్పుకుంది. తాజాగా ఆ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో తమన్నా ఏ విషయాన్ని మనసులో దాచుకోదు అన్నీ ఓపెన్ గానే చెప్పేస్తుంది అంటున్నారు కొంతమంది ఈమె అభిమానులు. ఇక తమన్నా ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడిందంటే.. నేను చాలా సెన్సిటివ్..ఇప్పటికే నాకు రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయింది.నేను యుక్త వయసులోనే ప్రేమలో పడ్డాను.కానీ నేను ప్రేమించిన అబ్బాయి కోసం నాకు ఇష్టమైన లైఫ్ ని వదులుకోవడానికి నా మనసొప్పలేదు. ఎందుకంటే నేను లైఫ్ లో పెద్ద గోల్ పెట్టుకున్నాను.
ఆ గోల్ కి నా ప్రేమ అడ్డు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పాను.అలా మొదటిసారి టీనేజ్ లోనే నా హార్ట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత మరోసారి కూడా నా హార్ట్ బ్రేక్ అయింది. ఇక నేను రెండోసారి ప్రేమించిన వ్యక్తి ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు అలాంటి వ్యక్తి ఎప్పటికైనా ప్రమాదమే.. అందుకే బ్రేకప్ చెప్పేసాను. ఆయనతో కొద్దిరోజులు రిలేషన్ లో కూడా ఉన్నా. కానీ ఎందుకో ఇద్దరికి సెట్ కాలేదనిపించింది. దాంతో రెండోసారి కూడా బ్రేకప్ జరిగింది.అలా నా లైఫ్ లో నాకు రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయింది అంటూ తమన్నా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఇక ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.అయితే మొదట్లో తమన్నా కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయితో ప్రేమలో పడిందని తెలుస్తోంది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో కార్తీతో ఈమె ప్రేమలో ఉందని అప్పట్లో మీడియా మొత్తం కోడై కూసింది. అంతేకాదు వీరిద్దరూ కలిసి హైదరాబాదులోని ఓ ఫ్లాట్లో సహజీవనం కూడా చేశారంటూ రూమర్ వినిపించింది.కానీ ఆ తర్వాత కార్తి తన తండ్రి మాట కాదనలేక బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని తమన్నా కి గుడ్ బై చెప్పారనే టాక్ వినిపించింది