Tuesday, September 10, 2024

40 కోట్లు పెట్టి హీరోయిన్ ప‌క్క ఫ్లాట్ కొనుగొలు చేసిన డైరెక్ట‌ర్..!

- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు ..ఓ హీరోయిన్ పక్క ఫ్లాట్‌ను భారీ మొత్తం చెల్లించి మరి కొనుగొలు చేశారు. అయితే ఇది యాధృచ్చికంగా జరిగిందా లేక కావాలని జరిగిందో తెలియదు కాని హీరోయిన్ పక్క ఫ్లాట్‌నే కొనుగొలు చేయడంతో ఆ దర్శకుడు వార్తల్లో నిలిచారు. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు..ఆనంద్ ఎల్ రాయ్. మనకు ఈ పేరు పెద్దగా తెలియక పోవచ్చు కాని.. బాలీవుడ్ జనాలకు మాత్రం..ఆనంద్ ఎల్ రాయ్ బాగానే సుపరిచితుడు. ముఖ్యంగా త‌ను వెడ్స్ మ‌ను అనే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటు దర్శకత్వం వహిస్తునే.. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించరాయ. తాజాగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 40 కోట్లు వేచించి ఒక ఫ్లాట్ కొనుగొలు చేయడం జరిగింది.
విశేషం ఏమిటంటే.. రాయ్ కొన్న ప‌క్క ఫ్లాట్‌లోనే లోనే హీరోయిన్ కృతీ స‌న‌న్ కూడా ఉంటుందట. అయితే కృతీ స‌న‌న్‌కు ఇది నివాసం కాదట. ఇందులో ఆమె అద్దెకు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది.

దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌కు మొదట నుంచి కూడా విలాసవంతమైన నివాసాలను కొనుగొలు చేయడం అలవాటని తెలుస్తుంది. దీనిలో భాగంగానే..ఆయన ముంబైలో 40 కోట్లు ఖర్చు చేసి ఓ ఫ్లాట్‌ను కొనడం జరిగిందట. ప్రస్తుతం కృతీ స‌న‌న్‌ ఉంటున్న ఫ్లాట్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ది. ఆయన ఇంట్లో కృతీ స‌న‌న్‌ అద్దెకు నివాసం ఉంటుంది. ఏకంగా 40 కోట్ల రూపాయ‌ల విలువైన ఇంటిని రెంట్ కు మెయింటెయిన్ చేస్తోందంటూ కృతీది కూడా విలాస‌వంత‌మైన స్థాయే అని స్ప‌ష్టం అవుతోంది. ఇక కృతీ స‌న‌న్‌ కెరీర్ విషయానికి వచ్చే సరికి ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో కృతీ స‌న‌న్‌ సీతగా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు పలు సినిమాలను ఆమె లైన్లో పెట్టింది. మహేష్ బాబు నటించిన 1 నేనొక్కిడినే సినిమాతో కృతీ స‌న‌న్‌ హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!